ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం రూ.172, రూ.184, రూ.190 ధరలతో మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు, కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే కోరుకునే వారి కోసం ఈ ప్లాన్లను రూపొందించారు. ఈ ప్లాన్లలో ఇంటర్నెట్ డేటా సౌకర్యం లేదు. తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వినియోగదారులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. డేటా అవసరమైన వారు అదనపు వోచర్లను తీసుకోవచ్చు.