ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని రాఘవపురం గ్రామపంచాయతీలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై మర్కోడికి వస్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక భాగం తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత గ్రామస్తులు బస్సును నిలిపివేసి డ్రైవర్‌తో వాగ్వాదం చేశారు.

సంబంధిత పోస్ట్