ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో, ఐఏఎస్ అధికారులమని నటిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విప్ర శర్మ అనే మహిళ, తన ఇద్దరు సోదరీమణులతో కలిసి, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బాధితుల నుంచి రూ. 55 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. విప్ర స్వయంగా ఐఏఎస్ లేదా పీసీఎస్ అధికారిగా నటిస్తూ, అధికారిక వాహనాల్లో తిరిగేది. అనుమానం రాకుండా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ, ఉద్యోగంలో చేరిన తర్వాత జీతాలు కూడా విడుదల చేసేది.