హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. చూస్తుండగానే మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఫరీదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే పేకామేడలా కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.