TG: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని 44వ జాతీయ రహదారిపై జల్లాపురం స్టేజీ సమీపంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న గూడ్స్ వాహనం ముందు ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో, వెనుక ఉన్న కారు కూడా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండగా మానవపాడు బస్టాప్ వద్ద ఆగిన బస్సును మీనా ట్రావెల్ బస్సు, లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.