సర్పంచ్ ఎన్నికలు బహిష్కరించిన మంచిర్యాల జిల్లాలోని మూడు గ్రామాలు

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వందూర్ గూడ, గూడెం గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలేదని ఈ గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 11న జరగాల్సిన ఈ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగియడంతో, ఈ గ్రామాల్లో ప్రత్యేక అధికారి పాలన కొనసాగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్