ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణం

AP: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం అనంతాయిపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రజని (60), ఆమె కుమార్తె గౌరి (40), కోడలు మధు (35) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.

సంబంధిత పోస్ట్