నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక మృతి!

TG: ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మృతి చెందింది. ఇల్లందు మండలంలోని సుంకర గూడెం గ్రామానికి చెందిన కాలం ప్రభాకర్, తేజ్య దంపతుల చిన్న కూతురు ప్రాన్సి (3) ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు కూతురి కోసం గ్రామంలో గాలించారు. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తు చేయగా.. ఓ ఇంటి కాంపౌండ్‌లో ఉన్న నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

సంబంధిత పోస్ట్