వేడి గంజిలో పడి మూడేళ్ల బాలిక మృతి

TG: మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణ మండలం గుడేబల్లూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నర్సింహులు, సుధాబాయి దంపతుల మూడేళ్ల కుమార్తె నందిని ఉంది. ఇంటి ముందు చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్