TG: మహబూబ్‌నగర్ దివిటి పల్లి సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఈతకు వెళ్లి క్వారీ గుంతలో మునిగి మృతి చెందారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికి తీసున్నారు. దీంతో క్వారీ వద్ద కుటుంబసభ్యులు ఘోరంగా రోధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.