పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు యువకులు మృతి

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరు గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి జాతీయ రహదారి పైనుంచి సర్వీసు రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ జిల్లా కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.

సంబంధిత పోస్ట్