AP: గుంటూరు జిల్లాలోని చెంచుపేటలో శనివారం దారుణ ఘటన వెలుగు చూసింది. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ ఫయాజ్ (50) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కర్రలు, రాడ్లతో దాడి చేసి ఆయనను చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.