మహిళను చంపి పొలంలో పడేసిన దుండగులు

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా RH క్యాంప్-5 సమీపంలో అత్యంత ఘోర ఉదంతం వెలుగుచూసింది. RH క్యాంప్-4కి చెందిన స్నేహ (25) అనే మహిళను దుండగులు రాతితో మోది దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఏడాదిన్నర చిన్నారిని తల్లి మృతదేహంపై ఉంచి పరారయ్యారు. పొలం వద్ద మృతదేహం లభించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕