యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాగరాజ్‌లోని కార్చన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎసోంటా గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, దహనం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని, హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.