రైతు పంటకు నిప్పు పెట్టిన దుండగులు.. 3 లక్షల నష్టం

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ముత్నూరు తండాలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రైతు రాంప్రకాష్ వేసిన 50 క్వింటాళ్ల శనగ పంట కుప్పకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సుమారు 3 లక్షల రూపాయల విలువైన పంట కాలి బూడిదైపోయింది. అకాల వర్షాలతో పంట నష్టపోగా, ఇప్పుడు దుండగులు తన పంటను తగలబెట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతు ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను శిక్షించాలని వేడుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్