నైరుతి రుతుపవనాలు రేపు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన రాయలసీమలో, 10వ తేదీ నాటికి దక్షిణ కోస్తా అంతటా ప్రవేశించి, 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తాయి. రాబోయే వారం రోజుల పాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరో ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ఎండలు బాగా కాసినప్పటికీ, వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పలేమని, ఎండలు, వర్షాలకు సంబంధం ఉండదని ఆయన పేర్కొన్నారు.