TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. యూసఫ్గూడ, పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, నాగోల్ వంటి ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని నగరవాసులకు అధికారులు సూచించారు.