ముగ్గురు పశువుల కాపరుల ప్రాణాలు తీసిన పులి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఓ పులి ముగ్గురు పశువుల కాపరుల ప్రాణాలు తీసింది. చంద్రాపూర్‌ జిల్లా సావళి అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. నెల రోజులుగా ఐదు గ్రామాల్లో పులి భయాందోళనలు సృష్టించింది. సెప్టెంబర్‌ 27 నుంచి పులి కోసం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించగా.. ఎట్టకేలకు బోనులో చిక్కింది. పులి చిక్కడంతో సావళి అటవీ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఊరట లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕