ముంబై జుహులోని ఓ పార్క్ సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ ఫిర్దోజ్‌కు గాయాలయ్యాయి. అతిదగ్గర నుంచి కాల్పులు జరపడంతో శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి. ఈ సమయంలో టైగర్ ష్రాఫ్ తప్పించుకోకుండా, పోలీసులు వచ్చేదాకా వేచి చూడకుండా తనే కారు డ్రైవ్ చేసుకుంటూ తన డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లడంపై ప్రశంసిస్తున్నారు. వెంటనే స్పందించి డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్లే ఫిర్దోజ్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో టైగర్ ష్రాఫ్ ‘రియల్ హీరో’ అంటూ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.