పులుల సంరక్షకుడు, రచయిత వాల్మీక్ థాపర్(73) క్యాన్సర్‌తో శనివారం కన్నుమూశారు. ఢిల్లీలో జన్మించిన థాపర్ రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో ఐదు దశాబ్దాలుగా పులులను అధ్యయనం చేయడానికి, సంరక్షణకు జీవితాన్ని అర్పించారు. రచయితగా పేరొందిన ఆయన వైల్డ్‌లైఫ్‌పై 12 పుస్తకాలు రాశారు. పలు డాక్యుమెంటరీలు తీశారు. ఈయన BBCతో కలిసి ‘ల్యాండ్ ఆఫ్ ది టైగర్’ అనే సిరీస్‌ను చిత్రీకరించారు.