టిక్ టాక్ స్టార్ దుర్గారావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చెల్లెలు మరణించడంతో దుర్గారావు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగంతో పంచుకున్నారు. తన చెల్లి సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ, 'ఇక నా చెల్లి లేదు' అని ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దుర్గారావుకు తమ సానుభూతిని తెలియజేస్తూ, 'ధైర్యంగా ఉండు' అని కామెంట్లు చేస్తున్నారు.