టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు సాధించారు. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్‌లో 50+ యావరేజ్ సాధించిన రెండో ప్లేయర్‌గా (కనీసం 500 రన్స్ చేసిన ఆటగాళ్లలో) నిలిచారు. విరాట్ కోహ్లీ సగటు 67.10 ఉండగా.. శనివారం హాఫ్ సెంచరీతో తిలక్ వర్మ సగటు 51.62కి చేరింది. వీరి తర్వాత ధోనీ (47.71), డుమిని (45.55), సంగక్కర (44.93) ఉన్నారు. అలాగే తిలక్ వర్మ నాటౌట్‌గా ఉన్న 12 T20Iల్లోనూ భారత్ విజయం సాధించింది.