TG: ములుగు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద పోలీస్ వాహనాన్ని ఓ టిప్పర్ ఢీకొట్టింది. జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి బయటకు వస్తున్న ములుగు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం కారును బండారుపల్లి నుంచి ములుగు వైపు వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, అడిషనల్ ఎస్పీ, డ్రైవర్, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.