బస్సును ఢీకొన్న టిప్పర్.. తెగిపడిన తల

కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల ఐటీఐ విద్యార్థి ఫక్కీరేష్ మృతి చెందాడు. అయితే హుబ్బళి నుంచి లక్ష్మేశ్వర్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఫక్కీరేష్, కుందగోళ్ స్టేజ్ వద్ద కిటికీలోంచి తల బయటకు పెట్టగా, వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని తల తెగిపడింది. దీంతో విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి ప్రయాణికులు భయంతో కేకలు వేయగా, బస్సులో విషాద వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్