లారీని వెనుకనుండి అతివేగంతో ఢీ కొట్టిన టిప్పర్

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్