ఈ చిట్కాలు పాటిస్తే మీ ఛార్జింగ్ కేబుల్స్ కొత్త వాటిలా మెరుస్తాయి!

ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడకం సర్వసాధారణమైంది. అయితే, ఛార్జింగ్ కేబుల్స్ వాడకం వల్ల నల్లగా మారి, అసహ్యంగా కనిపిస్తాయి. అయితే వీటిని పడేయకుండా, ఒక చిన్న చిట్కాతో కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు. ఒక మైక్రోఫైబర్ క్లాత్‌ను తీసుకొని, దాన్ని కొద్దిగా సబ్బు నీళ్లతో లేదా ఆల్కహాల్‌తో తడిపి వైరుపై మురికి ఉన్న ప్రాంతంలో శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత దానిని ఒక పొడి గుడ్డతో తుడిస్తే మరకలు పోతాయి. ఇలా చేసిన వెంటనే కేబుల్‌ను వాడకూడదు. దాదాపు 10–15 నిమిషాల పాటు ఆరిన తర్వాతే ఉపయోగించాలి. కాలిపోయిన లేదా లోతుగా గుంటలు పడిన కేబుల్స్‌ను మార్చడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్