తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 19 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 81,348 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,150 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.4 కోట్లుగా నమోదైంది. నేడు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.