AP: వైసీపీ హయాంలో తిరుమల శ్రీనివాసుడికి అపచారం జరిగిందని, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కలిపారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బ్రిటిష్ వారు కూడా తిరుమల వెంకన్న జోలికి వెళ్లలేదని, వెంకన్న జోలికి వెళ్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు. అన్ని ఆలయాలపై దాడులు చేశారని చంద్రబాబు విమర్శించారు.