సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. సూర్యుడు ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యశక్తికి ప్రతీక అని అర్చకులు తెలిపారు. సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕