AP: తిరుపతి తొక్కిసలాట బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "ఇలాంటి ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి లక్షలాది మంది వస్తారని తెలుసు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. దీనికి సీఎం నుంచి టీటీడీ అధికారులు, ఎస్పీ, కలెక్టర్ అందరూ ఇందులో భాగస్వాములే. లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా కౌంటర్ల వద్ద భద్రత ఎందుకు పెంచలేదు. " అని మండిపడ్డారు.