టీజేఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి: ప్రొఫెసర్ కోదండరాం

TG: తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 'బస్తీ బాట' పట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, గుండెల్లి రవీందర్ యాదవ్, రామచందర్, జశ్వంత్, పుష్పలత, అబ్రార్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్