సానుభూతి కోసం బెంగాల్‌లో టీఎంసీ మహిళా కార్యకర్త చేసిన హైడ్రామా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తలకు పెద్ద బ్యాండేజ్ కట్టుకుని మీడియా ముందుకు వచ్చిన ఆమె, బీజేపీ శ్రేణులు తనపై దాడి చేశారని ఆరోపించింది. అయితే, ఆమె మాట్లాడుతుండగానే ఒక వ్యక్తి బ్యాండేజ్‌ను లాగేయడంతో, ఆమెకు ఎలాంటి గాయం కాలేదన్న అసలు నిజం బయటపడింది. లైవ్‌లోనే ఈ బండారం బయటపడటంతో అందరూ షాక్‌కు గురయ్యారు.