పశ్చిమ బెంగాల్ దుబ్రాజ్‌పూర్ 6వ వార్డులో పీఎం ఆవాస్ యోజన ఇళ్ల మంజూరు కోసం రూ. 15,000 నుండి రూ. 30,000 వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) కౌన్సిలర్ ఇంటి ముట్టడికి దిగిన ప్రజలు, అక్కడే ఉన్న అతని ముఖ్య అనుచరుడు ధనంజయ్ గారైని పగటిపూట బహిరంగంగా చెప్పులతో కొడుతూ తరిమితరిమి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.