పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి చేశారు. పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఓ దుకాణం వద్ద ఆమెపై కోడిగుడ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు మహువా ఆరోపించారు. ఇది బెంగాల్ పోలీసుల ఫెయిల్యూర్ అని మండిపడ్డారు. కాగా మహువా ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.