అటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే 'ఖలేజా' ఉండాలి: కేటీఆర్

ఎన్నికల సమయంలో ప్రజలు గందరగోళంలో ఓటేస్తే భవిష్యత్తు ఆగమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. పాలమూరు బిడ్డనని, ప్రజల గోస తీరుస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. ప్రస్తుతం సామాన్యుడి దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడిందని, ప్రజల ఆస్తులు కరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతుబంధు, దళితబంధు వంటి సాహసోపేతమైన పథకాలు అమలు చేశారని, అటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే నాయకుడికి 'ఖలేజా' ఉండాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్