అమ్మవారి నైవేద్యం నిషేధిత పొగాకు.. భక్తుల ఆగ్రహం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో దుర్గదేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి నైవేద్యం కోసం తయారు చేస్తున్న పాయసంలో బెల్లం ముక్కల మధ్య నిషేధిత పొగాకు (అంబర్) ప్యాకెట్ బయటపడటం భక్తులను షాక్‌కు గురి చేసింది. గోదావరిఖని సమీపంలోని కోటి వద్ద షాపుల్లో కొనుగోలు చేసిన బెల్లంలో ఈ పొగాకు ప్యాకెట్ ఉన్నట్లు భక్తులు గుర్తించారు. ఈ ఘటనపై వారు మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించి, ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, బెల్లం విక్రయించే షాపులపై తనిఖీలు చేపట్టాలని కోరారు. ఇది భక్తి, విశ్వాసాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్