ప్రతి ఏటా జూన్ 13న అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన జన్యు సమస్య, దీనిలో మెలనిన్ వర్ణద్రవ్యం లోపించి చర్మం, జుట్టు, కళ్ళు తెల్లగా లేదా లేతగా మారతాయి. ఇది అంటువ్యాధి కాదు, దీనికి చికిత్స కూడా లేదు. దీని బారినపడినవారు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాజికంగానూ వివక్షకు గురవుతున్నారు.