ఏటా జులై 15న నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేని నిర్వహిస్తున్నారు. 'ప్లాస్టిక్ సర్జరీ' అనే పదాన్ని మొదటిసారిగా 1837లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఉపయోగించారు. 2011లో అప్పటి ప్లాస్టిక్ సర్జన్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాజా సభాపతి జాతీయ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవ భావనను మొదట ప్రవేశపెట్టారు. ప్లాస్టిక్ సర్జరీ ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. 2022 జులై 15 నుండి ఈ దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహిస్తున్నారు.