నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులు అర్పించారు. కీలక దశలో దేశ పురోగతికి పీవీ చిరస్మరణీయమైన కృషి చేశారని మోదీ కొనియాడారు. సమర్థవంతమైన పరిపాలనాదక్షుడిగా పీవీ తనదైన ముద్ర వేశారన్న ప్రధాని, అపారమైన జ్ఞానం, అవగాహన కలిగిన విశిష్ట పండితులుగా పీవీ గుర్తింపు పొందారని కీర్తించారు.