తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల సవరణకు బుధవారంతో గడువు ముగియనుంది. అప్లికేషన్లలో పొరపాట్లు దొర్లిన అభ్యర్థులు తమ వివరాలను సరిచేసుకోవడానికి అధికారులు ఈ అవకాశం కల్పించారు. పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, సంతకం, ఫోటో, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ వంటి కీలక వివరాలను నేరుగా ఆన్‌లైన్‌లో మార్చుకోలేరు. వీటి సవరణ కోసం విద్యార్థులు తగిన ఆధారాలతో హైదరాబాద్‌లోని JNTU కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సవరించుకోవచ్చు.