'పరీక్షా పే చర్చ (PPC) 2026'కు రికార్డు స్థాయి స్పందన లభించింది. జనవరి 9 నాటికి మొత్తం 4.3 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదై, గత ఏడాది 3.53 కోట్ల రికార్డును అధిగమించింది. ఇప్పటివరకు సుమారు 4 కోట్ల మంది విద్యార్థులు, 24 లక్షల ఉపాధ్యాయులు, 5.7 లక్షల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్‌కు ఈరోజే (జనవరి 11 అర్ధరాత్రి వరకు) చివరి అవకాశం. ఆసక్తి గలవారు innovateindia.mygov.inలో నమోదు చేసుకోవచ్చు.