సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ’ప్రపంచ సైకిల్ దినోత్సవం‘ జరుపుకుంటారు. 2018 ఏప్రిల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.