ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా–ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ జరగనుంది. కరాచి వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు గెలవగా, ఆఫ్ఘానిస్తాన్ కేవలం రెండు గెలిచింది. ఈ ట్రోఫీలో సఫారీలు పుంజుకోవాలని ఆరాటపడుతున్నారు. 2023 WC నుంచి అదరగొడుతున్న ఆఫ్ఘానిస్తాన్ మరో సంచలనానికి ఉవ్విళ్లూరుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.