TG: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బొమ్మగోని కిషన్, కవిత దంపతుల 45 రోజుల పసికందు రోడ్డు ప్రమాదంలో మరణించింది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వస్తుండగా, రామడుగు మండలం గోపాల్‌రావుపేట పెట్రోల్ బంక్ వద్ద కవిత చున్నీ బైక్ వీల్‌లో ఇరుక్కోవడంతో తల్లికూతుళ్లు కిందపడి గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం తెల్లవారుజామున పసికందు మృతి చెందింది.