స్టాక్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.70 లక్షలకు టోకరా

AP: స్టాక్‌ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ మోసగాళ్లు కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి నుంచి రూ.69.75 లక్షలు కాజేశారు. వాట్సాప్‌లో వచ్చిన ప్రకటన ద్వారా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి, నకిలీ ట్రేడింగ్‌ గ్రూప్‌లో చేర్చారు. తొలుత రూ.50 వేల పెట్టుబడిపై రూ.2,500 లాభం చూపించి, ఆ తర్వాత మరోసారి నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో నమ్మిన బాధితుడు 13 లావాదేవీల్లో ఏడు ఖాతాలకు రూ.69.75 లక్షలు బదిలీ చేశారు. చివరికి జీఎస్టీ, ఐటీ, కమీషన్‌ పేరుతో మరింత డబ్బు అడగడంతో మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕