దివ్యాంగుల వాహనాలకు టోల్ మినహాయింపు ఫాస్టాగ్ల కాలపరిమితిని కేంద్రం మార్చింది. 70-100% వైకల్యం ఉన్నవారికి ఐదేళ్లు, 40-70% వైకల్యం ఉన్నవారికి మూడేళ్ల కాలపరిమితితో 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' అందిస్తారు. వ్యాలిడిటీ ముగిశాక వైకల్య స్థితి ఆధారంగా రెన్యువల్ చేస్తారు. ఏటా రెన్యువల్ ఇబ్బందులను తగ్గించేందుకు ఈ మార్పులు చేశారు.