వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్‌ హీరో ప్రిన్స్‌

టాలీవుడ్ హీరో ప్రిన్స్ తన ప్రియురాలు సాయి మాచిరాజును ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ప్రిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి, ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. 'నీకు నాకు డాష్ డాష్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రిన్స్, 'బస్ స్టాప్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕