టాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు సింగర్ స్టెబిన్ బెన్నిని ఆమె వివాహమాడారు. వారం క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా నిన్న ఉదయ్ పూర్ లో పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య వీరు వివాహం చేసుకున్నారు. ఈమె బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారు.