TG: టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ లో 25 కిలోల టమాటా బాక్స్ కు రూ.100 ధర పలుకుతుంది. అంటే ఈ లెక్కనా కిలో టమాటా 4 రూపాయలే ధర పలుకుతుంది. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో కిలోకు రూ.5 కూడా రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కూలీలతో తెంపించి తీసుకెళ్తే ఇటు కూలి పైసలు, అటు కిరాయి మీద పడ్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.