దారుణంగా పడిపోయిన టమాట ధరలు

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత నెలలో కిలో 60 రూపాయలు పలికిన టమోటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు. బయట ప్రాంతాలలో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమోటా సాగు అధికంగా ఉండటంతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దిగుబడి పెరగడంతో మదనపల్లి మార్కెట్‌కు ధరలు పడిపోయాయి. దీంతో చేతికవచ్చిన పంటను ఏం చేసుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్